Aus vs SA Cricket: ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి (5/42) అద్భుత బౌలింగ్, అలాగే మాథ్యూ బ్రీట్జ్‌కే (88) మరియు ట్రిస్టాన్ స్టబ్స్ (74) అర్ధశతకాలతో రాణించడంతో, శుక్రవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 84 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. రికెల్టన్ (8), మార్క్రమ్ (0) త్వరగా ఔటైనా, బ్రీట్జ్‌కే డి జోర్జి (38)తో మూడో వికెట్‌కు 67 పరుగులు, స్టబ్స్‌తో నాలుగో వికెట్‌కు 89 పరుగులు జత చేశాడు. ముల్డర్ (26), మహారాజ్ (22 నాటౌట్) సహకరించగా, మిగతా బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. బౌలింగ్‌లో జంపా 3, బార్ట్‌లెట్, ఎలిస్, లబుషేన్ తలా రెండు వికెట్లు తీశారు.
చేజ్‌లో ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటై నాలుగోసారి వరుసగా స్వదేశంలో 200లోపు పరుగులు సాధించడంలో విఫలమైంది. జోష్ ఇంగ్లిస్ (87) ఒంటరిగా పోరాడగా, గ్రీన్ (35) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. హెడ్ (6), మార్ష్ (18), లబుషేన్ (1), క్యారీ (13), హార్డీ (10), బార్ట్‌లెట్ (8), ఎలిస్ (3), జంపా (3), హేజిల్‌వుడ్ (3 నాటౌట్) విఫలమయ్యారు. ఎంగిడి దెబ్బకు ఆసీస్ టాప్, మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. బర్గర్, ముతుస్వామి చెరో రెండు వికెట్లు తీశారు. అద్భుత ప్రదర్శనకు ఎంగిడి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఇరుజట్ల మధ్య చివరి వన్డే ఆదివారం ఇదే వేదికలో జరగనుంది.
Internal Links:
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్‌లు డ్రా..
ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో గుకేశ్ తడబాటు..
External Links:
సౌతాఫ్రికాదే సిరీస్… రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియాపై ఘన విజయం…