Australia Win On West Indies: జూలై 21న కింగ్స్‌టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు హైటెన్షన్ మ్యాచ్‌ను అందించాయి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 7 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ 55, రెస్టన్ చేిస్ 52, హెట్‌మయర్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. కానీ మిడిల్ ఆర్డర్ బలహీనతతో స్కోరు 200కి వెళ్లలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో బెన్ ద్వార్షూయిస్ 4 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేశాడు.
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట్లో వికెట్ కోల్పోయినా, కెమెరూన్ గ్రీన్ (51) మరియు మిచెల్ ఓవెన్ (50) హాఫ్ సెంచరీలతో జట్టును నిలబెట్టారు. చివర్లో బెన్ ద్వార్షూయిస్, షాన్ అబోట్ కలిసి విజయం సాధించారు. ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 190 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ బౌలింగ్‌లో గుడకేశ్ మోటీ, హోల్డర్ చెరో రెండు వికెట్లు తీశారు. మిచెల్ ఓవెన్ తన బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో విండీస్ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.
Internal Links:
డబ్ల్యూసీఎల్ 2025 నేటి నుంచి ఆరంభం..
ఇంగ్లండ్‌తో భారత్ నాలుగో టెస్టు..
External Links:
మరోసారి విండీస్ కు తప్పని ఓటమి.. 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం..!