భారత్ , శ్రీలంక తో టీ20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా, భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ ని కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం కల్గించడం వల్ల డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం సాధించింది. భారత్ టాస్ గెలిచినా కూడా వర్షం వస్తుందని ముందుగానే గ్రహించడంతో తొలుత బౌలింగ్ ని ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులకే పరిమితం అయింది. ఛేదనకు దిగిన భారత్ వర్షం అంతరాయంగా భారత లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఎనిమిది ఓవర్లకు 78 పరుగులుగా నిర్దేశించారు. ఈ డక్‌వర్త్ లూయిస్ ఛేదనలో భారత్ 3 వికెట్లు కోల్పియి , 9 బాల్స్ మిగిలి ఉండగానే లక్షాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్ (15 బంతులలో,30 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (12 బంతులలో,26 పరుగులు), హార్దిక్ పాండ్య (9 బంతులలో,22 పరుగులు ) చేసి అద్భుతంగా రాణించారు.
భారత జట్టు కి చెందిన ప్లేయర్ రవి బిషోని 3/26(4), ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ 43 పరుగుల తేడాతో శ్రీలంక పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ లో భాగంగా భారత్ శ్రీలంక తో మూడు మ్యాచ్లు ఆడనుంది కాగా , భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ ని కైవసం చేసుకుంది. ఈ టీ20 సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. జరిగిన రెండు మ్యాచ్లోను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య ఈ టీ20 సిరీస్ లో కీలక పాత్ర పోషించి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు.
