News5am, Breaking News Telugu (14-06-2025): వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. లార్డ్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై మూడో రోజున పూర్తి ఆధిపత్యం కనబర్చింది. 282 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగులు చేసింది. మార్క్రమ్ (102), బవుమా (65) అద్భుతంగా ఆడి జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్నారు. మరోవైపు, ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌట్ అయింది, అందులో స్టార్క్ 58 నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా విజయానికి ఇక మిగిలినది కేవలం 69 పరుగులే.
అయితే టార్గెట్ ఛేదనలో ప్రారంభంలోనే సఫారీ జట్టు తడబడింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌కి రికిల్‌టన్ (6), ముల్డర్ (27) వెనుదిరిగారు. అయినప్పటికీ, మార్క్రమ్ సెంచరీ సాధించి నిలకడగా ఆడగా, బవుమా కూడా మొదట ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తర్వాత గేమ్‌ను బాగా స్థిరపరిచాడు. లార్డ్స్ మైదానంలో 250కి పైగా లక్ష్యాన్ని ఛేదించడం టెస్ట్ చరిత్రలో కేవలం మూడు సార్లు మాత్రమే జరిగింది. సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌ను గెలిస్తే, టెస్ట్ చరిత్రలో మరో అరుదైన రికార్డును తమ పేరుతో నమోదు చేసుకుంటుంది.
More News Telugu:
Today News Telugu:
నేటి నుంచి ఇండియా ఇంట్రా స్క్వాడ్ వామప్ మ్యాచ్..
ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీం ఇండియా ఇంగ్లాండ్ చేరుకుంది..
More Breaking News Telugu: External Sources
చరిత్ర సృష్టించే దిశగా సౌతాఫ్రికా.. 69 పరుగుల దూరంలోనే సఫారీ జట్టు..