మహిళల టీ20 ఆసియ కప్ రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ ని చిత్తుగా ఓడించింది. వరుస విజయాలతో దూసుకువస్తున్న భారత్ ఈ విజయాన్ని కూడా తమ ఖాతాలో వేసుకొని ఫైనల్ కి చేరుకుంది. మొదటగా బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులకే పరిమితం అయింది. భారత బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్ (3/10), రాధా యాదవ్ (3/14) ) అద్భుతంగా రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతులలో, 55పరుగులు ), షఫాలీ వర్మ(28 బంతులలో, 26 పరుగులు) చేసి నాటౌట్ గా నిలిచి భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టుకి చెందిన రేణుకా సింగ్ “ప్లేయర్ అఫ్ ది మ్యాచ్” అవార్డు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ మహిళల జట్టు , శ్రీలంకతో తలపడనుంది.