శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, వన్డే సిరీస్‌లో తేలిపోతోంది. తోలి వన్డే టై గా ముగిసిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో కూడా భారత్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. తొలుత శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది , 9 వికెట్లకు, 240 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లో కమిందు మెండిస్, (44 బంతులలో, 40 పరుగులు), అవిష్క ఫెర్నాండో (62 బంతులలో, 40 పరుగులు ), దునిత్ వెల్లలాగే ( 35 బంతులలో, 39 పరుగులు) చేసి అద్భుతంగా రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన భారత జట్టు, రోహిత్ శర్మ (44 బంతులలో, 64 పరుగులు) అక్షర్ పటేల్ (44 బంతులలో, 44 పరుగులు) శుభమాన్ గిల్ (44 బంతులలో, 35 పరుగులు) చేసి ఫర్వాలేదనిపించారు. విరాట్ కోహిలి 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కి వెళ్ళిపోయాడు. శివమ్ దూబే మరియు కేఎల్ రాహుల్ ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్లారో వారికే తెలియదు.
శ్రీలంక జట్టు ప్లేయర్ వాండర్సే భారత ఆటగాళ్లను చిక్కులో పెట్టాడు. తనదైన శైలిలో అద్భుతమైన ప్రదర్శనతో 6 వికెట్లు పడగొట్టి, “ప్లేయర్ అఫ్ ది మ్యాచ్” అవార్డు కైవసం చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో విజేతలు గా నిలిచిన భారత్ జట్టు ఇదేనా? అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి మూడో వన్డే బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్ లో అయినా భారత జట్టు రాణిస్తుందో లేదో వేచి చూడాల్సిందే ?.