శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి, సిరీస్ ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అదే జోరుమీదున్న భారత్‌కు వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శుక్రవారం భారత్ – శ్రీలంక మధ్య జరిగిన తోలి వన్డే మ్యాచ్‌లో రెండు జట్లూ కూడా సరిగ్గా 230 పరుగులు చేశాయి. ఈ మ్యాచ్‌కు సూపర్ ఓవర్ లేకపోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. తొలుత శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది , 8 వికెట్లకు 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక బ్యాటర్లో దునిత్ వెల్లలాగే, (65 బంతులలో, 67 పరుగులు), పాతుమ్ నిస్సంక (75 బంతులలో, 56 పరుగులు ) చేసి అద్భుతంగా రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ ,రోహిత్ శర్మ (47బంతులలో,58 పరుగులు ), (అక్షర్ పటేల్ 57 బంతులలో, 33 పరుగులు ), చేసి ఫర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్ (43 బంతులలో,31 పరుగులు) చేయడంతో విజయం మనదేనని అనుకున్నారు. కానీ 47.3 ఓవర్లకు స్కోరు టై గా ముగిసింది. లంక బౌలర్లు సలంక (3/30), హసరంగ (3/58) అద్భుతంగా రాణించారు. జరిగిన మ్యాచ్ల్లో శ్రీలంక ప్లేయర్ దునిత్ వెల్లలాగే తన అద్భుతమైన ప్రదర్శనతో “ప్లేయర్ అఫ్ ది మ్యాచ్” కైవసం చేసుకున్నాడు.
