Curtis Campher: ప్రపంచ క్రికెట్‌లో ఎప్పుడూ ఏదో ఒక రికార్డు సృష్టించబడుతూనే ఉంటుంది. పెద్ద జట్ల ఆటగాళ్లకంటే, కొన్ని సందర్భాల్లో చిన్న జట్ల ఆటగాళ్లు అద్భుత రికార్డులు నమోదు చేస్తుంటారు. అలాంటి ఒక అద్భుతమైన ఘనతను ఐర్లాండ్‌కి చెందిన బౌలర్ కర్టిస్ కాంఫర్ సాధించాడు. ప్రస్తుతం ఐర్లాండ్‌లో జరుగుతున్న నేషనల్ టీ20 లీగ్‌లో కాంఫర్ 5 వరుస బంతుల్లో 5 వికెట్లు తీసి క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి బౌలర్‌గా కూడా గుర్తింపు పొందాడు. మాన్స్టర్ రెడ్స్ మరియు నార్త్ వెస్ట్ వారియర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో రెడ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది.
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ జట్టు 11 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కాంఫర్ 12వ ఓవర్ చివరి రెండు బంతుల్లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. తర్వాత తన మూడో ఓవర్ అయిన 14వ ఓవర్ ప్రారంభంలో వరుసగా మూడు బంతులకు మిగతా మూడు వికెట్లు తీసి, మొత్తం 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇది తొలి సందర్భం కావడం విశేషం. దీంతో మాన్స్టర్ రెడ్స్ జట్టు 100 పరుగుల తేడాతో గెలిచి ఘనవిజయం సాధించింది.
Internal Links:
మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్..
ఎడ్జ్ బాస్టన్‌లో చారిత్రాత్మక విజయం..
External Links:
5 బంతుల్లో 5 వికెట్లు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ బౌలర్..!