ENG vs IND First Test Match: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా కొత్త శకాన్ని ప్రారంభించనుంది. గత 18 ఏళ్లలో ఇంగ్లండ్‌లో భారత్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవకపోవడం, ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటివరకు కేవలం మూడు సార్లు మాత్రమే సిరీస్ గెలవడం గిల్‌కు సవాలుగా మారింది. బ్యాటింగ్ పరంగా యువ ఆటగాళ్లు మాత్రమే ఉండటంతో అనుభవం తక్కువగా ఉంది. జైస్వాల్‌కు ఇంగ్లండ్ అనుభవం లేదు. సుదర్శన్ ఇప్పటివరకు టెస్టు ఆడలేదు. గిల్‌కు ఇంగ్లండ్‌లో రికార్డు బలహీనంగా ఉంది. రాహుల్‌తో పాటు జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. సుదర్శన్ మూడో స్థానంలో, కరుణ్ నాయర్ ఆరో స్థానంలో బరిలో దిగొచ్చు. స్పిన్నర్‌గా జడేజా, పేస్ ఆల్‌రౌండర్ పోటీలో నితీశ్ రెడ్డి – శార్దూల్ మధ్య పోటీ ఉండగా, తెలుగు ఆటగాడు నితీశ్‌కే అవకాశం దక్కవచ్చని అంచనా. బౌలింగ్ విభాగంలో బుమ్రా కీలకం కాగా, సిరాజ్ అతనికి సహకరించనున్నాడు. మూడో పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ ఆడే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ ధోరణిలో ఆడుతూ భారత్‌ను ఒత్తిడిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్ లాంటి బ్యాటర్లు ఉన్న ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జో రూట్ మళ్లీ పరుగుల వర్షం కురిపించాలనే ఉత్సాహంతో ఉన్నాడు. అయితే బౌలింగ్‌లో ఇంగ్లండ్ బలహీనంగా ఉంది. అండర్సన్, బ్రాడ్ రిటైరయ్యారు. వుడ్ గాయంతో దూరమవ్వగా, ఆర్చర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. వోక్స్, కార్సీ, జోష్ టంగ్, స్టోక్స్‌లు పేస్ బౌలింగ్‌ను నిర్వహించనుండగా, బషీర్ స్పిన్ బాధ్యతలు చేపడతాడు.
హెడింగ్లీలో మ్యాచ్ జరుగనుండగా, అక్కడ పిచ్‌పై మొదట్లో పచ్చిక ఉండటం వలన పేసర్లకు సహకారం లభించే అవకాశం ఉంది. కానీ మ్యాచ్ కొనసాగుతూ పోతే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. భారత్ ఇప్పటివరకు హెడింగ్లీలో ఏడు టెస్టులు ఆడి, నాలుగు ఓడిపోయి, రెండు గెలిచి, ఒకటి డ్రాగా ముగించింది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
Internal Links:
చెల్సీ ఆటగాడు మైఖైలో ముద్రిక్‌పై డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అభియోగం నమోదైంది.
ఆటకు ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటున్నా..
External Links:
నేడే ఇంగ్లండ్, భారత్ తొలి టెస్టు.. ప్లేయింగ్ 11, పిచ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్