Gukesh Falters in Rapid and Blitz Chess Tournament: భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ డి. గుకేశ్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో కష్టాలను ఎదుర్కొన్నారు. శుక్రవారం జరిగిన బ్లిట్జ్ విభాగంలో తొమ్మిది రౌండ్లలో గుకేశ్ కేవలం ఒక విజయాన్ని మాత్రమే సాధించారు. డొమింగెజ్‌పై విజయం సాధించిన గుకేశ్, నాలుగు డ్రాలు చేసుకున్నారు, అయితే మిగతా నాలుగు గేమ్స్‌లో ఓటమి పాలయ్యారు. దీంతో అతను 13 పాయింట్లతో వియత్నాం ఆటగాడు లీమ్ లే క్వాంగ్‌తో కలిసి ఆరో స్థానంలో నిలిచారు.
ఇక అమెరికా గ్రాండ్‌మాస్టర్ లెవాన్ అరోనియన్ ఆరు విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అందరిని ఆకట్టుకున్నారు. గురువారం వరకు టాప్‌లో ఉన్న ఫాబియానో కరువానా రెండో స్థానానికి జారిపోయారు. మరో తొమ్మిది బ్లిట్జ్ గేమ్స్ మిగిలి ఉండగా, తిరిగి పుంజుకోవాలంటే గుకేశ్ ఎక్కువ విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది.
Internal Links:
వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా –ఎ జట్టుపై ఇండియా విమెన్స్–ఎ టీమ్ బోణీ…
ఐసీసీ ట్రోఫీ తప్పక గెలుస్తామంటున్న హర్మన్‌ప్రీత్…
External Links:
ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో గుకేశ్ తడబాటు.. ఆరో స్థానానికి పడిపోయిన వరల్డ్ చాంపియన్