Hardik Pandya: టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భవిష్యత్ లక్ష్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, రాబోయే పదేళ్లలో మరో 10 ఐసీసీ టైటిళ్లు గెలవడమే తన లక్ష్యమని తెలిపాడు. స్వదేశంలో టీ20 ప్రపంచకప్ గెలవడం చాలా భావోద్వేగ క్షణమని, ఈ విజయానికి జట్టు ఎంతో కష్టపడిందని అన్నాడు. ఫైనల్‌కు ఒక రోజు ముందు నుంచే తాము గెలుస్తామనే నమ్మకం ఉందని, ఓటమి గురించి ఆలోచనే రాలేదని హార్దిక్ వెల్లడించాడు.
ఇక తన వ్యక్తిగత జీవితంపై కూడా హార్దిక్ మాట్లాడాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మ జీవితంలోకి వచ్చిన తర్వాత విజయాలు వస్తున్నాయని చెప్పాడు. అలాగే ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో కీలకమైన 19వ ఓవర్ వేస్తున్నప్పుడు 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకు వచ్చిందని తెలిపాడు. ఆ అనుభవం తనకు ధైర్యం ఇచ్చిందని, అదే విషయాన్ని ఇషాన్, అభిషేక్‌లకు కూడా చెప్పినట్లు పేర్కొన్నాడు. రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం కొనసాగించాలని తన లక్ష్యమని హార్దిక్ తెలిపాడు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
నా జీవితంలోకి ఆమె వచ్చాకే గెలుస్తున్నా.. మరో పదేళ్లు ఆడతా, 10 కప్పులు గెలుస్తా: హార్దిక్ పాండ్యా