ముంబై: శ్రీలంక పర్యటనకు సంబందించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంతగానో ఎదురు చూస్తున హార్దిక్ అభిమానులకు నిరాశే ఎదురైంది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ అప్పగించారు. తొలుత హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చినా, చివరకు సూర్యకుమార్ యాదవ్ కే బీసీసీఐ మొగ్గుచూపింది. తాజాగా బీసీసీఐ ప్రకటించిన జట్టులో లంకతో జరిగే టీ20 సిరీస్‌కు పాండ్యాను ఎంపిక చేసినా విషయం తెలిసిందే. కాగా కనీసం హార్దిక్ కి వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. టీ20 సిరీస్ వైస్ కెప్టెన్ స్థానాన్ని శుభమన్ గిల్ కు అప్పగించారు. బీసీసీఐ సెలక్షన్ మీటింగ్ లో ఏం జరిగిందన్న దానిపై అనేక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అని తెలుస్తుంది. టీ20 కెప్టెన్సీ ఎంపిక పై ఆటగాళ్ల అభిప్రాయాలు బీసీసీఐ తెలుసుకున్నట్లు తెలుపుతున్నాయి. ఎక్కువగా సూర్య వైపే ఆటగాళ్లు మొగ్గు చూపారు అని సూర్య నాయకత్వంలో తాము సౌకర్యంగా ఆడగలమని ఆటగాళ్లు పేర్కొన్నారు. ఫిట్నెస్ కారణంగా హార్దిక్ కి వైస్ కెప్టెన్ గా బాధ్యతలను అప్పగించలేదని పలు కధనాలు వెలువడుతున్నాయి. బీసీసీఐ శ్రీలంక టూర్ కి ఎంపిక చేసిన జట్లు ఇవే.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), రిషబ్ పంత్ (డబ్ల్యుకె), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (సి), శుభమన్ గిల్ (విసి), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), సంజు శాంసన్ (డబ్ల్యుకె), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్. సిరాజ్.