ICC Batting Rankings: ఇండియా మహిళల క్రికెట్ జట్టులో వైస్-కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డ్యాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన ఒకసారి మళ్లీ తన అసాధారణ ఆటతీరుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ICC Batting Rankingలో ఆమె తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకోవడం భారత అభిమానులందరికీ గర్వకారణంగా మారింది. ఆరేళ్ల తర్వాత మంధాన నెంబర్ వన్ ప్లేస్‌ను తిరిగి సాధించింది. మంగళవారం విడుదలైన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం, గతంలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్‌వర్ట్‌ను మంధాన వెనక్కునెట్టి మొదటి స్థానంలోకి వచ్చింది. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వోల్‌వర్ట్ 27, 28 పరుగులే చేయగలగడంతో ఆమె 19 రేటింగ్ పాయింట్లు కోల్పోయింది. ఈ తేడా కారణంగా ఆమె నెంబర్ వన్ నుండి మూడవ స్థానానికి జారిపోయింది.
ప్రస్తుతం స్మృతి మంధాన 727 రేటింగ్ పాయింట్లతో వన్డే ఫార్మాట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆమె తర్వాత స్థానాల్లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సివర్-బ్రంట్ 719 పాయింట్లతో రెండో స్థానంలో, వోల్‌వర్ట్ కూడా అదే 719 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 2019 తర్వాత ఇది మంధానకు నెంబర్ వన్ స్థానం దక్కిన మొదటి సందర్భం. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో, సౌతాఫ్రికా బౌలర్లపై సెంచరీ బాది మంధాన తన ఫామ్‌ను మరోసారి నిరూపించింది. ఈ ప్రదర్శనతో ఆమె ర్యాంకు మెరుగై తిరిగి అగ్రస్థానాన్ని అందుకుంది. మహిళల క్రికెట్‌లో consistency మరియు క్లాస్‌కు ప్రతీకగా నిలిచిన మంధాన ఈ ఘనతను అందుకోవడం భారత క్రికెట్‌కు గౌరవంగా నిలిచింది.
ఇండియా మహిళల జట్టులో మంధాన మాత్రమే కాదు, జెమీమా రోడ్రిగ్స్ మరియు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ICC Batting Rankingsలో టాప్ 20లో నిలిచారు. జెమీమా 14వ ర్యాంకు, హర్మన్‌ప్రీత్ 15వ ర్యాంకులో ఉన్నారు. వీరి ప్రదర్శనలూ భారత మహిళల జట్టు స్థిరతకు బలంగా నిలుస్తున్నాయి. ఇక వచ్చే రోజులలో ఇండియా వుమెన్స్ టీమ్ ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ టూర్‌లో భారత్ ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఈ సిరీస్ భారత ఆటగాళ్లకు మరింత ఫామ్ మెరుగుపరుచుకునే అవకాశంగా మారనుంది. మంధాన ఫామ్‌లో ఉండటం, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సారథ్యంలో జట్టు సమతుల్యంగా కనిపించటం వల్ల ఈ సిరీస్ భారత మహిళల జట్టు విజయం వైపుగా నడిపే అవకాశం ఉంది.
Internal Links:
నెదర్లాండ్స్, నేపాల్ మధ్య T20 మ్యాచ్…
మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..
External Links:
ICC వన్డే ర్యాంకింగ్స్ టాప్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్..