Ind Vs Eng Arshdeep Singh Injury

Ind Vs Eng Arshdeep Singh Injury: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో వెనుకబడింది. మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం గిల్ సేనపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. లార్డ్స్ టెస్టులో ఓటమి తర్వాత ఇప్పుడు మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు జూలై 23న ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడాడు. బ్యాటర్ సాయి సుదర్శన్ కొట్టిన బంతిని అడ్డుకునే ప్రయత్నంలో అర్ష్‌దీప్ చేతికి తీవ్ర గాయం అయింది. వెంటనే ఫిజియో వచ్చి వేలికి టేప్ వేసి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అతడి గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. కోచ్ టెన్ డస్కాటె ప్రకారం అతడి చేతికి కుట్లు అయితే కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉండాల్సి రావొచ్చు.

ఇప్పటివరకు అర్ష్‌దీప్‌కి ఈ సిరీస్‌లో ఒక్క టెస్ట్‌ ఆడే అవకాశం రాలేదు. అయితే బుమ్రా లేదా మరో పేసర్ విశ్రాంతి తీసుకుంటే, అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే గాయం కారణంగా ఇప్పుడు అతడి అందుబాటుపై సందేహాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో అర్ష్‌దీప్ ఎడమ చేతికి బ్యాండేజ్ వేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. టెస్టుల్లో ఇప్పటివరకు అరంగేట్రం చేయని అర్ష్‌దీప్, టీ20ల్లో మాత్రం ఇప్పటికే తన ప్రతిభను చూపించాడు. 63 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు తీసిన అతడు, 9 వన్డేల్లో 14 వికెట్లు కూడా పడగొట్టాడు.

Internal Links:

కొనసాగుతున్న పీవీ సింధు వైఫల్యం..

ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్..

External Links:

టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ఆటగాడికి గాయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *