India vs England Test Match: లార్డ్స్ టెస్టులో టీమిండియాపై విజయం సాధించిన ఇంగ్లాండ్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయం కారణంగా టెస్ట్ సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. మూడో టెస్టులో మూడో రోజు జడేజా బలంగా కొట్టిన బంతిని ఆపే క్రమంలో బషీర్ ఎడమ చేతి చిటికెన వేలు విరిగిపోయింది. స్కాన్ చేసిన, పగుళ్లు బయటపడటంతో సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో బషీర్ నాలుగో, ఐదో టెస్టులకు అందుబాటులో ఉండడు. ఈ గాయం జరిగినా కూడా బషీర్ నాలుగో రోజు బ్యాటింగ్ చేసి, ఐదో రోజు చివరి వికెట్ తీసి ఇంగ్లాండ్ కు విజయం అందించాడు. నాలుగో టెస్ట్ జూలై 23 నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది.
ఈ సిరీస్‌లో బషీర్ మూడు టెస్టులు ఆడి, మొత్తం 6 ఇన్నింగ్స్‌లలో 140.4 ఓవర్లు (844 బంతులు) వేసి 10 వికెట్లు తీసాడు. అతను ఇప్పటివరకు ఈ సిరీస్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా నిలిచాడు. 54 యావరేజ్‌తో 541 పరుగులిచ్చాడు. బషీర్ గాయంతో టెస్ట్ సిరీస్‌కి దూరమవ్వడం ఇంగ్లాండ్ స్పిన్ విభాగానికి పెద్ద లోటే. అతని స్థానంలో ఇప్పటివరకు ఏ స్పిన్నర్‌ను ప్రకటించలేదు. బషీర్ పోరాట భావనపై కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రశంసలు కురిపించాడు. గాయంతోనూ బౌలింగ్ చేసి, జట్టుకు అండగా నిలిచిన బషీర్ వ్యక్తిత్వాన్ని కొనియాడాడు.
Internal Links:
రెండోసారి MLC ట్రోఫీ ఎగరేసుకుపోయిన MI న్యూయార్క్..
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ బౌలర్..
External Links:
ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్.. చివరి రెండు టెస్టులకు స్టార్ బౌలర్ ఔట్