India vs Pakistan: ఆసియా కప్ 2025లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ ఇచ్చిన లక్ష్యాన్ని భారత్ 25 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, ఇతరులు కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
తక్కువ టార్గెట్ చేధనలో భారత్ బ్యాటర్లు ధాటిగా ఆరంభించారు. గిల్ (10), అభిషేక్ శర్మ (31) అవుట్ అయినా, సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ కీలక భాగస్వామ్యం అందించారు. కెప్టెన్ సూర్యకుమార్ 37 బంతుల్లో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ వర్మ 31 పరుగులు చేయగా, చివర్లో శివమ్ దూబే (10 నాటౌట్) తో కలిసి సూర్యకుమార్ భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. పాకిస్తాన్ తరపున సైమ్ అయూబ్ 3 వికెట్లు తీయగా, ఇతర బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.
Internal Links:
ఒమన్‌ను చిత్తు చిత్తు చేసిన పాక్..
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు
External Links:
పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..