IPL ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ముందు, BCCI ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నాకౌట్ మ్యాచుల్లో నమోదైన ప్రతి డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటనున్నట్లు తెలిపింది. టాటా కంపెనీ భాగస్వామ్యంతో ఈ మంచి కార్యక్రమానికి నడుం బిగించినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీని కారణంగానే ప్లేఆఫ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఇమేజ్ గ్రాఫిక్ ఉపయోగించారు. ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. అంటే ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో నమోదైన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 323. ఇక్కడ ఒక్కో డాట్ బాల్‌కు 500 చెట్లను నాటాలని బీసీసీఐ ప్రకటించింది. ఈ లెక్క ప్రకారంటాటా సంస్థ భాగస్వామ్యంతో బీసీసీఐ మొత్తం 1,61,500 మొక్కలు నాటనుంది. కాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.