ఐపీఎల్ మహా సంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్, ఆర్‌సీబీ తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం, టాస్ రాత్రి 7 గంటలకు మరియు మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే, మ్యాచ్ జరగనున్న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వద్ద ప్రస్తుతం నల్లటి మేఘాలు కమ్ముకొన్నాయి. అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతున్నాయి. మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది.