JioHotstar Record Views: భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో భారీ రికార్డు సృష్టించింది. ఆదివారం జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం సమయంలో ఈ మ్యాచ్‌కు వ్యూస్ సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. న్యూజిలాండ్ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు వ్యూస్ సుమారు 58.3 కోట్లుగా ఉండగా, మ్యాచ్ ఉత్కంఠగా మారడంతో సంఖ్య వేగంగా పెరిగింది. ముఖ్యంగా టిమ్ సీఫర్ట్ ఔటైన సమయంలో వ్యూస్ దాదాపు 63.2 కోట్లకు చేరాయి.
మ్యాచ్ చివరి క్షణాల్లో ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరగడంతో వ్యూస్ సంఖ్య భారీగా పెరిగి, భారత్ విజయం ఖరారయ్యే సమయంలో దాదాపు 78–80 కోట్లకు చేరువైంది. చివరి క్యాచ్ పట్టిన సమయంలో సుమారు 74.5 కోట్ల వ్యూస్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ 96 పరుగుల తేడాతో గెలిచింది. ఇదే టోర్నీలో భారత్–ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌ను కూడా జియో హాట్‌స్టార్‌లో ఒకేసారి సుమారు 6.52 కోట్ల మంది వీక్షించారని ఐసీసీ తెలిపింది. ఇది భారత్‌లో క్రికెట్‌కు ఉన్న భారీ ప్రజాదరణను చూపిస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
భారత్, న్యూజిలాండ్ ఫైనల్.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!