News5am, Latest Breaking News (15-05-2025): భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఒక వారం పాటు ఐపీఎల్ 2025 నిలిచిపోయిన విషయం తెలిసిందే. మే 17 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఐపీఎల్ 2025లోని మిగిలిన మ్యాచ్‌ల కోసం బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆటగాళ్లకు తదుపరి సీజన్‌కు అర్హత ఉండదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ప్లేయర్స్ ఐపీఎల్ 2025 వరకే కొనసాగుతారని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ప్రకటించాయి.
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా విదేశీ ప్లేయర్స్ స్వదేశాలకు వెళ్లిపోయారు. చాలా మంది విదేశీ ప్లేయర్స్ వేర్వేరు కారణాల చేత ఐపీఎల్ 2025కి అందుబాటులో ఉండడం లేదు. వెస్టిండీస్-ఇంగ్లండ్ వన్డే సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లాంటి కారణాల చేత ఆటగాళ్లు కొందరు ఐపీఎల్ చివరి దశలో ఆడడం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఫ్రాంచైజీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. స్వదేశాలకు వెళ్లిపోయిన ఆటగాళ్ల స్థానాల్లో తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు అవకాశం ఇచ్చింది. అయితే ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆటగాళ్లకు ఈ సీజన్ వరకే ఆడే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది.
More Latest News:
Latest Breaking News:
పదవీ విరమణ వేడుకలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా..