News5am, Latest Breaking News (05-06-2025): ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మొదటిసారిగా టైటిల్ గెలుచుకుని చాంపియన్‌గా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన ఆర్సీబీ విజయం నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కోసం ఘన స్వాగత వేడుకలను కర్ణాటక క్రికెట్ సంఘం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే బుధవారం జరిగిన ఈ వేడుకల సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.
ఈ ఘటనపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో స్పందించాడు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఏం చెప్పాలో తెలియడం లేదని పేర్కొన్నాడు. బుధవారం రాత్రి 10:45 గంటలకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేస్తూ, ఆర్సీబీ మేనేజ్‌మెంట్ విడుదల చేసిన ప్రకటనను రీపోస్ట్ చేశాడు. అందులో, తొక్కిసలాట ఘటన గురించి మాకు మీడియాలో తెలిసిందని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. అభిమానుల భద్రతే మాకు అత్యంత ముఖ్యమైందని, వెంటనే అన్ని వేడుకలను రద్దు చేశామని పేర్కొన్నారు. అభిమానులందరూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
More Latest Breaking News Telugu:
Latest News:
ఐపీఎల్ టైటిల్ గెలిచాక కోహ్లీ ఎమోషనల్..
నేటి సాయంత్రం 6గంటలకి ఐపీఎల్ ముగింపు వేడుకలు..
More Latest Breaking News: External Sources
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన కోహ్లీ!