News5am, Breaking News Latest News Telugu (05-06-2025): పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్ రెండో రౌండ్‌లో 6వ సీడ్ పోర్నపావీ చోచువాంగ్ చేతిలో 22-20, 10-21, 18-21 తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ మొత్తం 77 నిమిషాలు సాగింది. మొదటి గేమ్‌ను సింధు చివరి వరకు పోరాడి గెలుచుకున్నా, రెండో గేమ్‌లో అనేక తప్పిదాలు చేయడంతో పూర్తిగా వెనకపడ్డారు. మూడవ గేమ్‌లో ఆమె బాగానే ప్రయత్నించినా, చివర్లో దూకుడు తక్కువగా ఉండటం వల్ల విజయం అందలేదు. ఆమె కదలికలు, కోర్ట్ కవరేజ్ మెరుగైనప్పటికీ, టాప్-10 ఆటగాళ్లపై విజయం సాధించేందుకు సరిపోలేదు.
చివరి గేమ్‌లో ఇద్దరూ సమంగా పోటీపడ్డారు, కానీ చోచువాంగ్ నిర్ణయాత్మక క్షణాల్లో మెరుగ్గా ఆడింది. సింధు ఓ సమయానికి ఆధిక్యంలోకి వచ్చినా, చివర్లో వరుస తప్పిదాలు ఆమెను మ్యాచ్‌కు దూరం చేశాయి. చివరి పాయింట్‌లో ప్రయత్నించిన, స్మాష్ నెట్‌లో పడటంతో ఆమె పోరాటానికి ముగింపు వచ్చింది. ఇక డబుల్స్‌లో ట్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్ జంట కూడా రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన ఫుకుషిమా-మట్సుమోటో జంట చేతిలో 13-21, 22-24 తేడాతో ఓడిపోయింది. వారు రెండవ గేమ్‌లో మూడు గేమ్ పాయింట్ల వరకు వచ్చినా, అవకాశాలను నిలబెట్టుకోలేక నిష్క్రమించారు.
More Latest News:
Breaking News Latest News Telugu
ఐపీఎల్ టైటిల్ గెలిచాక కోహ్లీ ఎమోషనల్..
నేటి సాయంత్రం 6గంటలకి ఐపీఎల్ ముగింపు వేడుకలు..