News5am, Telugu News Latest News (02-06-2025): ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ నార్వే చెస్ 2025 ఆరో రౌండ్‌లో అద్భుత విజయాన్ని సాధించాడు. క్లాసికల్ టైమ్ కంట్రోల్‌లో తన కెరీర్‌లో తొలిసారిగా మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. ప్రారంభ రౌండ్‌లో గుకేష్‌పై గట్టిపోటీనిచ్చిన కార్ల్‌సెన్, అనంతరం గుకేష్ ఎదురుదాడిని తట్టుకోలేక ఓడిపోయాడు. ఎండ్‌గేమ్‌లో కార్ల్‌సెన్ చేసిన తప్పును గుకేష్ చాకచక్యంగా ఉపయోగించి మూడు పాయింట్లు సాధించాడు. ఈ విజయంతో గుకేష్ 8.5 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకాడు. అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ కరువానా కంటే కేవలం ఒక పాయింట్ వెనుకబడ్డాడు. కార్ల్‌సెన్‌ను క్లాసికల్ ఫార్మాట్‌లో ఓడించిన రెండో భారతీయ టీనేజర్‌గా గుకేష్ నిలిచాడు. గత సంవత్సరం ప్రజ్ఞానంద ఇదే ఫీట్ సాధించాడు.
ఈ ఓటమి తర్వాత మాగ్నస్ కార్ల్‌సెన్ తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. “ఓ మై గాడ్!” అంటూ అరిచి, బోర్డుపై తన పిడికిలి బిగించి కొట్టాడు. ఈ చర్యపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆట ముగిశాక గుకేష్‌కు రెండుసార్లు క్షమాపణలు చెప్పి అతని వీపు తట్టినప్పటికీ, కార్ల్‌సెన్ ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి భిన్నమని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ యూజర్ “నువ్వు అహంకారాన్ని ఇలా జయించావు.. అభినందనలు డి గుకేష్” అని పోస్టు చేయడం గమనార్హం.
More News:
Telugu News Latest News
తొలి క్వాలిఫయర్‌లో చిత్తుగా ఓడిన పంజాబ్..
విజయమే లక్ష్యంగా బరిలోకి ఆర్‌సీబీ..
More Updates: External Sources
సూపర్ విక్టరీ.. ప్రపంచ చెస్ నంబర్-1 మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించిన గుకేష్