News5am, Latest Telugu Sports News (20-05-2025): నిన్న జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించి, వారిని ప్లేఆఫ్స్ నుంచి బయటకు పంపింది. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్ దిగ్వేష్ రాఠి వివాదానికి కేంద్రబిందువయ్యాడు. ఎనిమిదో ఓవర్‌లో అతను వేసిన మూడో బంతిని అభిషేక్ శర్మ షాట్‌కు ప్రయత్నించగా, బంతి సరిగా కనెక్ట్ కాకపోవడంతో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ అందుకున్నాడు. వెంటనే దిగ్వేష్ అభిషేక్‌ను ఉద్దేశించి స్లెడ్జింగ్ చేసి, ‘చల్ దొబ్బెయ్’ అంటూ నోట్‌బుక్ సెలెబ్రేషన్ చేశాడు. ఇది అభిషేక్‌కు నచ్చక, డ్రెస్సింగ్‌రూమ్ వైపు వెళ్లుతూ ఆగి తీవ్రంగా స్పందించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, అంపైర్లు జోక్యం చేసుకుని వారిని వేరు చేశారు.
ఈ సంఘటనపై అభిమానులు భిన్నంగా స్పందించారు. “యువరాజ్ శిష్యుడితో పెట్టుకుంటున్నావ్… నిప్పుతో ఆటలొద్దురా” అంటూ దిగ్వేష్‌ను ట్రోల్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇద్దరినీ పిలిచి మాట్లాడి, షేక్ హ్యాండ్ చేయమని కోరడంతో వివాదం ముగిసింది.
More News:
Latest Telugu Sports News:
దడ పుట్టిస్తున్న ప్లేఆఫ్స్ లెక్కలు..
నీరజ్ చోప్రా చారిత్రాత్మక 90.23 మీటర్ల వేడుక..
More Sports News: External Sources
నిప్పుతో ఆటలొద్దురోయ్ అంటూ దిగ్వేశ్ ని ట్రోల్ చేస్తున్నారు..