Mahikaa Sharma: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి కారణం క్రికెట్ కాదు, అతని వ్యక్తిగత జీవితం. మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయిన తర్వాత, మోడల్ మహికా శర్మతో ప్రేమలో ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. మహికా పోస్ట్ చేసిన వీడియోలో హార్దిక్ ఉన్నాడని నెటిజన్లు చర్చించారు. అయితే ఇప్పటివరకు హార్దిక్ గానీ, మహికా గానీ స్పందించలేదు.
ఎకనామిక్స్, ఫైనాన్స్ చదివిన మహికా శర్మ మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆమె అనేక ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో నటించింది. టాప్ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ కూడా చేసింది. 2024లో ఆమె ‘మోడల్ ఆఫ్ ది ఇయర్ (న్యూ ఏజ్)’ అవార్డు గెలుచుకుంది. కంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ ర్యాంప్ వాక్ పూర్తి చేసి నిబద్ధత చాటుకుంది. హార్దిక్, నటాషా 2020లో పెళ్లి చేసుకున్నారు. 2023లో మళ్లీ ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ విభేదాల కారణంగా గతేడాది విడిపోయారు. కుమారుడు అగస్త్య బాధ్యతలను ఇద్దరూ కలిసి చూసుకుంటామని తెలిపారు.
Internal Links:
పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
ఒమన్‌ను చిత్తు చిత్తు చేసిన పాక్..
External Links:
హార్దిక్ పాండ్యాతో ప్రేమాయణం?.. ఎవరీ మహికాశర్మ?