పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది. అది కూడా చరిత్రలో నిలిచిపోయేలా పతకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మహిళా షూటర్ మను బాకర్ కాంస్యం సాధించింది. ఇప్పటి వరకు ఒలింపిక్ మహిళల షూటింగ్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. మను బాకర్ కాంస్య పతకాన్ని చారిత్రాత్మక పతకంగా అభివర్ణించాడు.
“పారిస్ ఒలింపిక్స్‌లో తొలి పతకం, వెల్ డన్ మను బకర్. కాంస్యం సాధించినందుకు అభినందనలు.ఈ పతకం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్‌కు పతకం అందించిన తొలి మహిళగా మను బకర్ నిలిచింది. ఇది నిజంగా అద్భుతమైన విజయం” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.