మూడేళ్ల కిందట ఒలంపిక్స్ లో తన సంచలన ప్రదర్శనతో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈసారి పసిడి గెలవాలని తన సాయ శక్తులని ఉపయోగిస్తున్నాడు. మంగళవారం స్టేడ్ డి వేదికగా ఫ్రాన్స్‌లో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్‌లో 89.34 మీటర్ల త్రోతో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఒలంపిక్స్ లో ఫైనల్ చేరేందుకు 84 మీటర్ల మార్క్ కాగా తోలి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల జావెలిన్ విసిరి నేరుగా ఫైనల్ కి అర్హత సాధించాడు. గ్రూప్ – బీ తో పాటు రెండు గ్రూప్ లోను నీరజ్‌దే అత్యుత్తమ ప్రదర్శన గా నిలిచింది.
అయితే ఇదే పోటీల్లో భారత్ నుంచి మరో ప్లేయర్ పాల్గొనగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాడు. భారత ప్లేయర్ అయిన కిశోర్ కుమార్ తన బెస్ట్ అందించినప్పటికీ ఫైనల్‌కు మాత్రం అర్హత సాధించలేకపోయాడు. అత్యుత్తమంగా 80.73 మీటర్ల త్రో విసిరిన కిశోర్ కుమార్ 9వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్స్‌లోనే తేలిపోయాడు. అయితే జావెలిన్ త్రో ఫైనల్ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. ఇండియాలోని కోట్లాది మంది క్రీడాభిమానుల కళ్లు నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ ఈసారి కూడా గోల్డ్ తెస్తాడన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్ నీరజ్ చోప్రా అంటూ విషెస్ తెలుపుతున్నారు.