Palestine Number 1 Football Player Died: పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో నంబర్ వన్ ఫుట్‌బాల్ ఆటగాడు సులేమాన్ అల్-ఒబెద్ మరణించాడు. అతని మరణాన్ని పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (PFA) ధృవీకరించింది. 100 కంటే ఎక్కువ గోల్స్ చేసిన అతని మరణం ప్రపంచాన్ని కలిచివేసింది. అక్టోబర్ 2023లో యుద్ధం ప్రారంభమైన తర్వాత 662 మంది ఆటగాళ్లు చనిపోయారని PFA తెలిపింది. 41 ఏళ్ల సులేమాన్ ఆగస్టు 6న దక్షిణ గాజాలో కాల్పుల్లో మరణించాడు. అతన్ని ‘పాలస్తీనా ఫుట్‌బాల్ పీలే’ అని పిలిచేవారు. గాజాలో ఫుట్‌బాల్‌కు సంబంధించి చనిపోయిన వారి సంఖ్య ఇప్పుడు 321కి చేరింది. వీరిలో ఆటగాళ్లు, కోచ్‌లు, రిఫరీలు, బోర్డు సభ్యులు ఉన్నారు.
సులేమాన్ 2007లో ఇరాక్‌తో జరిగిన వెస్ట్ ఏషియన్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో జాతీయ జట్టులోకి వచ్చాడు. ఆయన ఆసియా కప్, పాన్ అరబ్ గేమ్స్, ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ వంటి టోర్నీల్లో పాల్గొన్నాడు. మొత్తం 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, రెండు గోల్స్ చేశాడు. 2013లో ఖతార్‌తో మ్యాచ్‌లో చివరిసారి ఆడాడు. క్లబ్ స్థాయిలో ఖిద్మత్ అల్ షాటియా, షబాబ్ అల్ అమారి, గాజా స్పోర్ట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2016 నుంచి 2018 వరకు వరుసగా మూడు సీజన్లలో గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడు.
Internal Links:
రసవత్తర ముగింపు దిశగా ఓవల్ టెస్ట్..
External Links:
క్రికెట్‌కు మించిన విషాదం: ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా నంబర్-1 ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి..