ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. స్వప్నిల్ కుసాలే 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3వ స్థానంలో కాంస్య పతకం సాధించాడు. ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మూడూ కాంస్య పతకాలు కావడం విశేషం. అంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించింది. మంగళవారం జరిగిన10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో మను–సరబ్‌జోత్ సింగ్ 16–10తో లీ వోనోహో–ఓ యె జిన్ (సౌత్ కొరియా)పై గెలిచారు.
బుధవారం (జూలై 31) జరిగిన క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో ఏడో స్థానంలో నిలిచిన స్వప్నిల్ కుసాలే పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3వ స్థానం ఫైనల్‌కు అర్హత సాధించాడు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారం (ఆగస్టు 1) ఫైనల్స్ జరిగాయి. స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం సాధించాడు. పుణెకు చెందిన స్వప్నిల్ కుసాలే ఒలింపిక్ చరిత్రలో పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3వ స్థానం ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా నిలిచాడు.