ఆగస్టు 28న పారిస్‌లో ప్రారంభమైన పారాలింపిక్ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఈ వేడుకలో ఆర్చర్ హర్విందర్ సింగ్, అథ్లెట్ ప్రీతి పాల్ భారత పతాకధారులుగా వ్యవహరించారు. ఇక ఈ క్రీడల్లో ఈసారి భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఏకంగా 29 పతకాలు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఈసారి 25 పతకాల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో 4 పతకాలు అధికంగా సాధించింది. అలాగే గత టోక్యో ఒలింపిక్స్ కంటే ఈసారి 10 పతకాలు అదనంగా సాధించడం గమనార్హం. ఈసారి టాప్-20లో భారత్‌కు చోటు దక్కింది. భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. ఇక డ్రాగన్ కంట్రీ చైనా అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఆ తర్వాత టాప్-5లో బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, బ్రెజిల్ నిలిచాయి. ఘనంగా జరిగిన ఈ ముగింపు వేడుకల్లో ఫ్రెంచ్ మ్యూజీషియన్లు, గ్రామీ అవార్డ్ విన్నర్ అండర్సన్ పాక్‌ల ప్రదర్శనతో స్టేడ్ డి స్టేడియం హోరెత్తింది.