పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత పారా స్ప్రింటర్ ప్రీతి పాల్ రికార్డు సృష్టించింది. మహిళల 200 మీటర్ల టీ35 కేటగిరీలో కాంస్య పతకం గెలుచుకుంది. 100మీటర్ల టీ35 ఈవెంట్‌లో ఆమె ఇప్పటికే కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి జరిగిన 200 మీటర్ల రేసులో ప్రీతి కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది.
రేసును 30.01 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో 200 మీటర్ల రేసులో దేశానికి తొలి పారాలింపిక్ పతకం లభించింది. అంతేకాకుండా, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా ప్రీతి చరిత్ర సృష్టించింది. ప్రీతికి పారాలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకం. మరోవైపు బ్యాడ్మింటన్‌లో కూడా మూడు పతకాలు ఖాయమయ్యాయి.