Pro Kabaddi Starts From Today: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ సీజన్ శుక్రవారం వైజాగ్‌లో ప్రారంభం కానుంది. ఏడేళ్ల తర్వాత వైజాగ్‌కు తిరిగి వస్తున్న ఈ లీగ్ నేషనల్ స్పోర్ట్స్ డే రోజున మొదలవుతోంది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్‌తో తలపడనుంది. తర్వాతి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణెరి పల్టాన్ పోటీ పడతాయి.

సీజన్ ప్రారంభానికి ముందు పీకేఎల్ ఆర్గనైజర్స్‌తో పాటు 12 జట్ల కెప్టెన్లు ఐఎన్ఎస్ కుర్సురా సబ్‌మెరైన్‌ను సందర్శించారు. ఈ సీజన్ పలు కొత్త మార్పులతో రాబోతుందని, గెలుపు సులభం కాదని తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ తెలిపారు. ఆతిథ్య జట్టుతో పోరాటం తమకు స్ఫూర్తినిస్తుందని, బెస్ట్ ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నామని తమిళ్ తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ధీమా వ్యక్తం చేశాడు. వైజాగ్‌లో సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత జైపూర్, చెన్నై, న్యూఢిల్లీ నగరాల్లో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయి.

Internal Links:

క్రికెట్‌కు మహ్మద్ షమీ రిటైర్‌మెంట్ అంటూ ప్రచారం..

సౌతాఫ్రికాదే సిరీస్‌… రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియాపై ఘన విజయం…

External Links:

కబడ్డీ లవర్స్‎కు గుడ్ న్యూస్.. ఇవాళ్టి (ఆగస్ట్ 29) నుంచే ప్రొ కబడ్డీ స్టార్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *