Sinquefield Cup 2025: భారత గ్రాండ్‌మాస్టర్లు డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద సింక్‌ఫీల్డ్ కప్‌లో మూడో రౌండ్ గేమ్‌లను డ్రాగా ముగించారు. గురువారం గుకేశ్ అమెరికా ఆటగాడు సామ్యూల్ సెవియన్‌తో ఆడాడు. నల్ల పావులతో సిసిలియన్ డిఫెన్స్ ఆడిన గుకేశ్, రోస్లిమో వేరియేషన్‌లో బలంగా ఎదుర్కొని, మిడిల్ గేమ్‌ను నియంత్రించాడు. దీంతో ఆట చివరికి డ్రాగా ముగిసింది. అదే విధంగా ప్రజ్ఞానంద ఉజ్బెకిస్తాన్ ఆటగాడు నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్‌తో ఆడి, తన గేమ్‌ను డ్రాగా ముగించాడు.
ఇప్పటి వరకు తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద, ఈసారి తొలిసారి నల్లపావులతో ఆడుతూ నిమ్జో ఇండియన్ డిఫెన్స్ వినియోగించాడు. నొడిర్బెక్ దాన్ని అధిగమించలేకపోవడంతో గేమ్ డ్రాగా ముగిసింది. ఈ రౌండ్‌లో అమెరికా ఆటగాడు ఫ్యాబియానో కరువాన ఫ్రాన్స్ ఆటగాడు అలిరెజా ఫిరౌజ్‌పై విజయం సాధించాడు. పోలాండ్ ఆటగాడు డుడా జాన్ క్రిస్టోఫ్–అమెరికా ఆటగాడు వెస్లీ సో, అలాగే ఫ్రాన్స్ ఆటగాడు మ్యాక్సిమ్ వాచిర్ లాగ్రేవ్–అమెరికా ఆటగాడు లెవనో అరోనియన్ మధ్య మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, కరువాన చెరో రెండు పాయింట్లతో టాప్–2లో ఉండగా, గుకేశ్ ఒకటిన్నర పాయింట్లతో సంయుక్త మూడో స్థానంలో ఉన్నాడు.
Internal Links:
ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో గుకేశ్ తడబాటు..
వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా –ఎ జట్టుపై ఇండియా విమెన్స్–ఎ టీమ్ బోణీ…
External Links:
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్‌లు డ్రా