South Africa Clean Sweeps

South Africa Clean Sweeps: సౌతాఫ్రికా జట్టు అద్భుత రౌండ్ ప్రదర్శనతో జింబాబ్వేపై రెండో టెస్టులో ఇన్నింగ్స్ 236 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం (జులై 8) జింబాబ్వే 51/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించి 77.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. నిక్ వెల్చ్ (55), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (49), కైటానో (40), తనక చివాంగ (22) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ 4, సేనురన్ ముత్తుసామి 3, కొడి యూసుఫ్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో వియాన్ ముల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు లభించాయి. గత 20 ఏళ్లలో జింబాబ్వేకు ఇదే అతిపెద్ద ఓటమిగా నిలిచింది.

జింబాబ్వే పేసర్ కుందాయ్ మాటిగిము తొలి రోజు ఆటలో బాల్‌ను ప్రమాదకరంగా విసిరినందుకు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 72వ ఓవర్ సమయంలో మాటిగిము తన ఫాలోత్రూ ముగిసిన తర్వాత బంతిని ఆపి, బ్యాటర్ లువాన్ డి ప్రిటోరియస్ వైపు తీవ్రంగా విసిరాడు. బంతి బ్యాటర్ మణికట్టును తాకింది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ స్పందించి, మాటిగిము ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినట్లు తెలిపారు.

Internal Links:

ఎడ్జ్ బాస్టన్‌లో చారిత్రాత్మక విజయం..

వాళ్లకు కాస్త చెప్పండయ్యా, అది టీ20 కాదు టెస్టు మ్యాచ్ అని..

External Links:

మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్.. జింబాబ్వేను క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసిన సౌతాఫ్రికా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *