Surabhi team wins Silver

Surabhi team wins Silver: ఆసియా షూటింగ్ చాంపియన్‌‌షిప్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. తెలంగాణ షూటర్ సురభి భరద్వాజ్ 25 మీటర్ల రైఫిల్ ప్రోన్ టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ గెలిచింది. శుక్రవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఫైనల్లో సురభి, మణిని కౌశిక్, వినోద్ విదర్సతో కూడిన భారత అమ్మాయిల టీమ్ 1846 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. సౌత్ కొరియా స్వర్ణం, కజకిస్తాన్ కాంస్యం గెలుచుకున్నాయి. ఇదే సమయంలో నాన్-ఒలింపిక్ కేటగిరీ పోటీల్లో రాజ్‌కన్వార్ సింగ్ సంధు, అంకుర్ మిట్టల్, అనుష్క భాటి గోల్డ్ మెడల్స్ సాధించారు. రాజ్‌కన్వార్ 583 పాయింట్లతో తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు.

అదేవిధంగా గుర్‌ప్రీత్ సింగ్, అంకుర్ గోయల్‌తో కలిసి రాజ్‌కన్వార్ 1733 పాయింట్లతో టీమ్ గోల్డ్ గెలిచాడు. మెన్స్ డబుల్ ట్రాప్‌లో అంకుర్ మిట్టల్ 107 స్కోరుతో స్వర్ణం సాధించాడు. విమెన్స్ డబుల్ ట్రాప్‌లో అనుష్క భాటి (93), ప్రణిల్ ఇంగ్లే (89), హఫీజ్ కాంట్రాక్టర్ (87) వరుసగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ సాధించి క్లీన్ స్వీప్ చేశారు. ఈ ముగ్గురు కలిసి టీమ్ ఈవెంట్‌లో కూడా స్వర్ణం గెలుచుకున్నారు.

Internal Links:

కబడ్డీ లవర్స్‎కు గుడ్ న్యూస్..

క్రికెట్‌కు మహ్మద్ షమీ రిటైర్‌మెంట్ అంటూ ప్రచారం..

External Links:

ఆసియా షూటింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సురభి టీమ్‌‌‌‌కు సిల్వర్‌‌‌‌‌‌‌‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *