T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ ఈరోజు: ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో బుధవారం నమీబియాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా సూపర్ “8” కి అర్హత సాధించింది. 73 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34), డేవిడ్ వార్నర్ (8 బంతుల్లో 20 పరుగులు), మిచెల్ మార్ష్ (9 బంతుల్లో 18) చెలరేగిపోయి 5.4 ఓవర్లలో ఛేజింగ్‌ను ముగించారు. పైగా మొదటి ఇన్నింగ్స్‌లో నమీబియా జట్టు 72 పరుగులకే ఆలౌటైంది, నమీబియా బ్యాటింగ్‌లో రెండంకెల స్కోరు చేసిన ఇద్దరు ఆటగాళ్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ఒకరు. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్స్ తీసి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్ (ఆడమ్ జాంపా) నిలిచాడు.