News5am, Telugu News Updates-1 (28-05-2025): ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలి రోజే రెండు పతకాలతో మెరిసింది. పురుషుల 10,000 మీటర్ల పరుగులో 26 ఏళ్ల గుల్వీర్ సింగ్ అద్భుతంగా ప్రదర్శించి 28 నిమిషాలు 38.63 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. జపాన్‌కు చెందిన మిబుకి సుజూకీ (28:43.84) రజతం గెలుచుకోగా, బహ్రెయిన్‌కు చెందిన అల్బర్ట్ కిబిచి (28:46.82) కాంస్యం అందుకున్నాడు. అదే రేసులో భారత అథ్లెట్ సవన్ బర్వల్ (28:50.53) నాల్గవ స్థానంలో నిలిచాడు.
ఇక 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో సెర్విన్ సెబాస్టియన్ ఒక గంట 21 నిమిషాలు 13.60 సెకన్లలో ముగించి కాంస్య పతకంతో మూడో స్థానాన్ని అందుకున్నాడు. మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో అన్నూ రాణి నాలుగో స్థానంతో ముగించింది. అలాగే, పురుషుల 1500 మీటర్ల రేసులో యూనుస్ షా ఫైనల్‌కి అర్హత సాధించి భారత్‌కు మరో ఆశను కలిగించాడు.
More Latest News:
Telugu News Updates-1
తొలి రౌండ్‌లో డి గుకేష్‌ను ఓడించిన మాగ్నస్ కార్ల్సెన్
More Latest Telugu News: External Sources
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తొలిరోజే భారత్ కు పసిడి