శ్రీలంక వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్ 2024లో భారత్ యూఏఈపై 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 201 పరుగులు చేసింది. 202 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 123 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటింగ్‌లో కవిషా ఎగోడాగే(40*) అత్యధిక పరుగులు చేసింది. ఆ తర్వాత ఇషా ఓజా (38) పరుగులు చేసింది. ఖుషీ శర్మ (10) పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లు రాణించడంతో జట్టు విజయం సాధించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత రేణుకా సింగ్, తనూజా కన్వర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ (37), స్మృతి మంధాన (13) పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత దయాళన్ హేమలత (2) పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (66), రిచా ఘోష్ (64) పరుగుల కీలక ఆటను ఆడి భారత్ స్కోరును పెంచారు. హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. రిచా ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఆ తర్వాత.. జెమీమా రోడ్రిగ్స్ (14) రాణించడంతో భారత్ 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో కవిషా 2 వికెట్లు తీసింది. సమైరా, హీనా ఒక్కో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్ విజయంతో భారత్ సెమీఫైనల్ చేరనుంది.