News5am, Latest IPL News (15-05-2025): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025 కోసం వెస్టిండీస్ హిట్టర్ రొమారియో షెపర్డ్ భారత్‌కు వచ్చేశాడు. ఈ విషయాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మెంటర్ డ్వేన్ బ్రావో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించాడు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వెస్టిండీస్ వెళ్లిన షెపర్డ్ మళ్లీ భారత్ చేరుకున్నాడు. వాయిదా పడిన ఐపీఎల్ 2025 ఈ నెల 17 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షెపర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది, ఒకే ఓవర్లో 30 పరుగులు చేసి తనను తాను స్టార్‌గా నిలబెట్టుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా వచ్చిన హాఫ్ సెంచరీగా నిలిచి, ఆర్సీబీ తరపున ఓ రికార్డు కూడా స్థాపించాడు.
ఇంగ్లాండ్‌తో మే 29న ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం షెపర్డ్‌కు వెస్టిండీస్ జట్టులో స్థానం కలిగినా, అదే రోజు నుంచి ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌లు ప్రారంభం అవుతుండటంతో విండీస్ ఆటగాళ్లు భారత్‌లో ఉండటానికి అనుమతిస్తారా లేదా అన్నది ఇంకా క్రికెట్ వెస్టిండీస్ ధృవీకరించాల్సి ఉంది. ఇదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ కూడా భారత్‌కు వచ్చారు. రస్సెల్ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పంచుకున్నాడు, అందులో రస్సెల్‌తో పాటు నరైన్, షెపర్డ్, డ్వేన్ బ్రావోలు కనిపించారు.
More Latest IPL News:
Latest News:
పదవీ విరమణ వేడుకలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా..
More Latest News: External Sources
https://ntvtelugu.com/news/ipl-2025-good-news-for-rcb-romario-shepherd-landed-in-india-799261.html