World boxing championship: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు విజయాలతో ఆరంభించారు. మెన్స్ 75 కేజీల తొలి రౌండ్‌లో సుమిత్ కుండు 5–0 తేడాతో జోర్డాన్‌కు చెందిన మహ్మద్ అల్ హుస్సేన్‌పై గెలిచాడు. బౌట్ ప్రారంభం నుంచే బలమైన పంచ్‌లతో ఆధిపత్యం చూపి ప్రత్యర్థిని డిఫెన్స్‌లోకి నెట్టాడు. రెండో రౌండ్ ముగిసే సరికి స్పష్టమైన ఆధిక్యం సాధించాడు. చివర్లో కాస్త వెనక్కి తగ్గినా హుస్సేన్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు సుమిత్ ప్రిక్వార్టర్స్‌లో బల్గేరియా ఆటగాడు, యూరోపియన్ చాంపియన్ రామి కివాన్‌తో తలపడనున్నాడు.
మహిళల విభాగంలో కూడా భారత్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. 65 కేజీల తొలి రౌండ్‌లో నీరజ్ ఫొగాట్ ఫిన్లాండ్‌కు చెందిన క్రిస్టా కోవలైనెన్‌ను 3–2 తేడాతో ఓడించింది. 70 కేజీల్లో సనామాచా చాను డిట్టే ఫ్రాస్టోల్మ్‌పై 4–1 తేడాతో గెలిచింది. అయితే మెన్స్ 90 కేజీల్లో హర్ష్ చౌదరీ పోరులో ఓడిపోయాడు. పోలాండ్ ఆటగాడు టుటక్ ఆడమ్ ఆర్‌ఎస్‌సీ ద్వారా విజయం సాధించాడు.
Internal Links:
25 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై..
ఎంఎస్ ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు..
External Links:
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సుమిత్, నీరజ్ బోణీ