హరారే వేదికగా ఆదివారం జింబాబ్వే తో జరిగిన ఐదొవ టీ20లో మ్యాచ్‌లో జింబాబ్వే పై 42 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మొదటి టీ20 సిరీస్ లో భారత్ జింబాబ్వే పై 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. రేండోవ టీ20 సిరీస్ నుంచి భారత్ పుంజుకొని వరుస విజయాలతో విజయ బేరి మోగించుకుంటూ వచ్చింది. చివరిగా ఐదొవ టీ20 సిరీస్ కూడా గెలిచి తమ కతాలో వేసుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 167/6 పరుగులు సాధించింది. బ్యాటర్లలో సంజు శాంసన్ 58(45), శివమ్ దూబే 26(120, రియాన్ పరాగ్ 22(24) అద్భుతంగా రాణించారు. ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు తీయడంతో భారత్ జింబాబ్వేను 125/10కి పరిమితం చేసింది. గిల్ సారధిగా ఉంటూ టీమిండియా కుర్రాళ్లతో (4-1 )తో సిరీస్ ని చేజిచుకున్నారు. శివమ్ దూబే అటు బ్యాట్టింగ్ లో మరియు బౌలింగ్ లో అద్భుతంగా రాణించి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. జరిగిన ఐదు టీ20 సిరీస్ లో భారత్ కి చెందిన ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ప్లేయర్ అఫ్ ది సిరీస్ కైవసం చేసుకున్నాడు.
భారత్ : సంజు శాంసన్ 58(45), శివమ్ దూబే 26(12), రియాన్ పరాగ్ 22(24) .
జింబాబ్వే : డియోన్ మైయర్స్ 34(32), ఫరాజ్ అక్రమ్ 27(13), తడివానాశే మారుమని 27(24).