కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 17 విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఆజట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకుంది. ఎస్ ఆర్ హెచ్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా కేవలం 10. 3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లీగ్ లో టాప్-2 ప్లేసుల్లో నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు టైటిల్ కోసం తలపడ్డాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఎస్ ఆర్ హెచ్ ఓటమితో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.