News5am, Latest Telugu News Today (10/05/2025) : హైదరాబాద్ నగరంలో టపాసులు కాల్చటాన్ని పోలీసులు పూర్తిగా నిషేధించారు. ఇది పెళ్లి అయినా, పేరంటం అయినా, షాపు ఓపెనింగ్ అయినా సంబంధం లేదు — ఎలాంటి సందర్భంలోనైనా టపాసులు కాల్చొద్దని స్పష్టంగా హెచ్చరించారు. టపాసులు అమ్మే వారికి కూడా వార్నింగ్ ఇచ్చారు. టపాసులు విక్రయించటం, కాల్చటం రెండూ నిషేధించబడ్డాయి.
ఈ నిషేధానికి ముఖ్యమైన కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ నుండి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, భద్రతా చర్యలగా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. ఇలాంటి సమయంలో టపాసుల శబ్దాలు బాంబుల శబ్దాల్లా అనిపించడంతో ప్రజలు భయానికి గురయ్యే అవకాశం ఉంది. టపాసా? బాంబా? అనే సందేహం కలిగే పరిస్థితి ఉండొచ్చు.
కాబట్టి పోలీసులు చెబుతున్నారు — ఎవరు టపాసులు కాల్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. “పొరపాటున కాల్చాం”, “తెలియకుండా చేశాం” అనే నెపాలు తప్పించవు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి, చాలా సీరియస్‌గా తీసుకుంటాం అన్నారు.
హైదరాబాద్ ప్రజలందరికీ ఒకే సూచన — టపాసులు కాల్చవద్దు, జాగ్రత్తగా ఉండండి.