Train-School Van Accident: తమిళనాడులోని కడలూరు జిల్లా సెమ్మన్‌కుప్పం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు-రైలు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు ఒక రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో ఉండగా, అదే సమయంలో వచ్చి చేరిన రైలు దాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. మృతుల సంఖ్యపై అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
ఇక ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ రైలు రాకను గమనించకుండానే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. మరోవైపు, రైలు వస్తున్న సమయంలో గేట్ కీపర్ నిద్రలో ఉండడంతో గేట్ మూసివేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఫలితంగా స్కూల్ బస్సు ముందుకు వెళ్లగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన తర్వాత రైల్వే గేట్ కీపర్‌పై ప్రజలు ఆగ్రహంతో దాడి చేసినట్టు సమాచారం.
Internal Links:
ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం – జూన్ 12, 2025
పదే పది సెకన్లలో ఇంటికి చేరుతారనగా దూసుకొచ్చిన మృత్యువు..
External Links:
స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు… కడలూరులో ఘోర ప్రమాదం, ముగ్గురు విద్యార్థులు మృతి…