News5am, Breaking Telugu Latest News 1 (21-05-2025): అధిక వేగం కారణంగా హయత్‌నగర్ కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు ఉన్న సింగిల్ రోడ్డులో వేగంగా వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డి అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అంతా ఒకే గ్రామానికి చెందినవారు. బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లి తిరిగివస్తున్న సమయంలో, ఇంటికి చేరువలో ఉన్నప్పుడు ఈ విషాదకర ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వచ్చింది. కారులో ఉన్నవారు వేగంగా వచ్చి DCM వాహనాన్ని ఢీకొట్టినట్టు స్పష్టంగా కనిపించింది. ఢీకొట్టిన తీవ్రతతో కారులో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. స్థానికులు తీవ్రంగా శ్రమించి వాటిని బయటకు తీశారు. పోలీసులు ప్రమాదానికి అధిక వేగమే కారణమని నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ ఘటన కంట్లూరులో తీవ్ర విషాదాన్ని నింపింది.
More News:
Breaking Telugu Latest News 1
సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి
తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం
More General News Telugu Today: External Sources
పదే పది సెకన్లలో ఇంటికి చేరుతారనగా దూసుకొచ్చిన మృత్యువు.. వామ్మో అతివేగంతో.. షాకింగ్ వీడియో