కడప నవరాత్రి మహోత్సవాల్లో కడప శ్రీ మలయప్ప స్వామి అష్టాదశ (18) వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పదో రోజు పుష్పయాగంలో పురాణ పురుషోత్తమ ఉభయ దేవతలతో పున్నమి రేడుగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2024 దేవుని కడప బ్రహ్మోత్సవ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కడప రాయుడి ఆలయ రాజగోపురం కొత్త రంగులతో బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది.