Ratha Saptami 2026: ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని రథ సప్తమిగా పిలుస్తారు. ఈ రోజున సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపుకు ప్రయాణం ప్రారంభిస్తాడని శాస్త్రాలు చెబుతాయి. అందుకే మాఘ సప్తమి నుంచి వచ్చే ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి–అదితి దేవి దంపతులకు సూర్యభగవానుడు జన్మించిన రోజే రథ సప్తమి. దీనిని సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి అనే పేర్లతో కూడా పిలుస్తారు. హిందూ పంచాంగం ప్రకారం 2026 సంవత్సరంలో జనవరి 25వ తేదీ (ఆదివారం) రథ సప్తమి వచ్చింది.
రథ సప్తమి నాడు చేసే ప్రత్యేక స్నానం అత్యంత పుణ్యప్రదమని పండితులు చెబుతారు. ఈ రోజున చేసే స్నానం వల్ల ఏడు జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలు తొలగిపోతాయని నమ్మకం. స్నానం చేసే ముందు ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగి పళ్లను శిరస్సుపై ఉంచుకుని తలస్నానం చేయాలని శాస్త్రాలు సూచిస్తాయి. ఇవి సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. అందుకే రథ సప్తమి రోజున ఈ విధంగా చేసే స్నానం ఏడు రకాల పాపాలను నశింపజేస్తుందని విశ్వాసం.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
రేపే రథ సప్తమి- ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి పక్కా!