Tirumala Rush Today: తొలి ఏకాదశి, శనివారం ఒకే రోజు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి చేరుకున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున భక్తులు ముందస్తు ప్రణాళికతో తిరుమలకు రావాలని సూచించారు.
శుక్రవారం మొత్తం 78,721 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, వారిలో 38,018 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.4.98 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు నెలలో మరమ్మతుల పనులు, సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల కారణంగా పుష్కరిణి మూసివేయబడుతుంది. దీంతో మొత్తం 40 రోజుల పాటు పుష్కరిణిలో హారతి కార్యక్రమం నిర్వహించబడదు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!