Srisailam Temple Sees Huge Devotee

Srisailam Temple Sees Huge Devotee: శ్రావణమాసం ముగింపు దశకు చేరుకోవడంతో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా శ్రావణ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చేరుకున్నారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 42,078 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

భారీ రద్దీ కారణంగా అభిషేకం, స్పర్శ దర్శనం, కుంకుమార్చన సేవలను తాత్కాలికంగా నిలిపివేసి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది. శ్రావణ మాసోత్సవాలు మరో ఐదు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *