Varalakshmi vratams

Varalakshmi vratams: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సామూహిక వ్రతాలు నిర్వహించారు. చంద్రవతి కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1,800 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. మహాగణపతి పూజతో ప్రారంభించి, వరలక్ష్మీదేవికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, వ్రతకథ నిర్వహించారు. భక్తుల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు.

వ్రతం చేసిన భక్తులకు అమ్మవారి చీర, రవిక, పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, పుస్తకం, ప్రసాదాలు అందించారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామి అమ్మవార్ల దర్శనం, అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎం. శ్రీనివాసరావు దంపతులు, అధికారులు పాల్గొన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించినట్లు ఈఓ తెలిపారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు.. చంద్రవతి కళ్యాణమండపంలో నిర్వహణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *